హైదరాబాద్ లో రూ.8 లక్షల ఓజి కుష్ పట్టివేత..203 గ్రాములు స్వాధీనం

హైదరాబాద్ లో రూ.8 లక్షల ఓజి కుష్ పట్టివేత..203 గ్రాములు స్వాధీనం
  • ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఆదివారం రెండు చోట్ల రూ.8 లక్షల విలువైన 203 గ్రాముల ఓజీ కుష్ పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అసిస్టెంట్​కమిషనర్​ఫోర్స్​సీఐ మహేశ్ , టీం సభ్యులు అమీర్​పేట్, నాంపల్లి ప్రాంతాల్లో  ఆదివారం దాడులు నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో చల్లా నారాయణ శ్రీనిధి అనే వ్యక్తి వద్ద 101 గ్రాముల ఓజీ కుష్ పట్టుకున్నారు. నాంపల్లిలో నరేందర్ కుమార్ దగ్గర 102 గ్రాముల ఓజీ కుష్ దొరికింది.